e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుటుంబంలో శుభకార్యం

సందీప్ రెడ్డి–హర్ష్యతి నిశ్చితార్థ వేడుకకు ప్రముఖుల హాజరు

రాజకీయ, పోలీసు, ప్రభుత్వ, వివిధ రంగాల ప్రముఖుల సందడి.. నూతన జంటకు ఆశీస్సులు

మన భారత్ , పటాన్‌చెరు: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుటుంబంలో వివాహ వేడుక సందడి నెలకొంది. ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి కుమారుడు గూడెం సందీప్ రెడ్డి వివాహ నిశ్చితార్థ వేడుకలు శుక్రవారం హైదరాబాద్‌లోని జేఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో ఈ శుభకార్యం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.

శుక్రవారం ఉదయం సందీప్ రెడ్డికి ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ ఐపీఎస్ అధికారి వై. నాగిరెడ్డి కుమార్తె హర్ష్యతి తో నిశ్చితార్థ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఇరు కుటుంబాల పెద్దలు, బంధువులు, ఆత్మీయుల సమక్షంలో జరిగిన ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు పలువురు ప్రముఖులు తరలిరావడంతో కన్వెన్షన్ సెంటర్‌లో సందడి నెలకొంది.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తదితరులు వేడుకలో పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి, కుమార్తె నైమిష రెడ్డి కూడా ఈ శుభకార్యానికి హాజరై నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.

పోలీసు, అధికార వర్గాల ప్రముఖుల సందడి

రాజకీయ ప్రముఖులతో పాటు పోలీసు, ప్రభుత్వ ఉన్నతాధికారుల హాజరు కూడా ఈ వేడుకకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి సహా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, కుటుంబ మిత్రులు, ఆత్మీయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిశ్చితార్థ వేడుకలో భాగస్వాములయ్యారు.

ఈ సందర్భంగా అతిథులు సందీప్ రెడ్డి, హర్ష్యతి జంటను అభినందిస్తూ పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. వారి జీవితంలో నూతన అధ్యాయం ఆనందం, ప్రేమ, పరస్పర అవగాహనతో కొనసాగాలని ఆకాంక్షించారు. ఇరు కుటుంబాల పెద్దలు అతిథులకు ఆత్మీయ స్వాగతం పలికి, వేడుకకు వచ్చిన ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు.

రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఒకే వేదికపై కలుసుకోవడం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సందీప్ రెడ్డి, హర్ష్యతి నిశ్చితార్థ వేడుక కుటుంబ సభ్యుల ఆనందోత్సాహాల మధ్య ఘనంగా ముగిసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE