e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

పంట నష్టాలను పరిశీలించి రైతులను ఆదుకోవాలి: కల్లెం కరుణాకర్ రెడ్డి

తలమడుగు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి

పంట నష్టాలను పరిశీలించి రైతులను ఆదుకోవాలి..

వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపికి కల్లెం కరుణాకర్ రెడ్డి వినతి

మన భారత్, తలమడుగు: అక్టోబర్ 29

ూతలమడుగు మండలాన్ని కరువు ప్రభావిత మండలంగా ప్రకటించి, పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని మాజీ సర్పంచ్ కరుణాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

మండలంలో ఈ ఏడాది వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడిందని నాయకులు కల్లెం కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా పత్తి, సోయాబీన్ పంటల్లో ఆశించిన దిగుబడులు రాక రైతులు తీవ్రంగా నష్టపోయారని వివరించారు. పంటల సాగు కోసం అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులకు కనీసం పెట్టిన ఖర్చులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మండలంలో రైతుల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోందని, ఇప్పటికే రైతుల ఆత్మహత్యలు చోటుచేసుకోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. రైతులకు అవసరమైన సహాయం అందించడంలో ఆలస్యం జరిగితే మరిన్ని కుటుంబాలు తీవ్ర సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

గ్రామాలవారీగా పంట నష్టాల అంచనా వేయాలి

కరువు పరిస్థితులను అంచనా వేసేటప్పుడు మండల సగటు వర్షపాతాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోకుండా, ప్రతి గ్రామంలో నమోదైన వర్షపాతం, పంటల పరిస్థితి, దిగుబడుల తగ్గుదల, రైతులకు జరిగిన వాస్తవ నష్టాలను సమగ్రంగా పరిశీలించాలని కల్లెం కరుణాకర్ రెడ్డి కోరారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించి పంట నష్టాలను శాస్త్రీయంగా అంచనా వేయాలని సూచించారు.

కేంద్ర ప్రభుత్వ కరువు నిర్వహణ మార్గదర్శకాలకు అనుగుణంగా తలమడుగు మండలంలోని పరిస్థితులను పునఃపరిశీలించి, కరువు ప్రభావిత మండలంగా ప్రకటించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు. నష్టపోయిన రైతులకు తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు, రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.

తలమడుగు మండలంలో నెలకొన్న వ్యవసాయ పరిస్థితులపై ప్రభుత్వం సమగ్రంగా దృష్టి సారించి, రైతులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలని నాయకులు కల్లెం కరుణాకర్ రెడ్డి కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE