e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

నవరాత్రి వేడుకల్లో కుంకుమార్చన..

దేవాపూర్‌లో భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన.. నవరాత్రి వేడుకల్లో పాల్గొన్న గ్రామస్తులు

మన భారత్, తలమడుగు: అక్టోబర్ 16, ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో శ్రీ నవశక్తి దుర్గామాత మండల్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారి నామస్మరణ, ప్రత్యేక పూజలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా శీలం కోటి శివాజీ పంతులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి కుంకుమార్చన చేశారు. గ్రామ సర్పంచ్ పోరండ్ల సంతోష్ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మహిళలు, భక్తులు సంప్రదాయబద్ధంగా కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

శ్రీ నవశక్తి దుర్గామాత కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. మహిళలు కుంకుమార్చనలో పాల్గొని కుటుంబాల సుఖసంతోషాలు, గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో  కిరణ్, మ్యానాల్ వార్ మల్లన్న, షగంటి వెంకటేష్, మోహన్, నరుకుల నారాయణ, నయని అరవింద్, సీపతి ప్రదీప్, జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు, గ్రామస్తుల సహకారంతో కుంకుమార్చన కార్యక్రమం భక్తిపూర్వకంగా కొనసాగింది.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE