e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

భక్తిశ్రద్ధలతో శారదాదేవికి కుంకుమార్చన..

మన భారత్, తలమడుగు:అక్టోబర్ 16,

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో శుక్రవారం మహిళలు శారదాదేవి అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేపట్టి, కుంకుమార్చన ద్వారా తమ భక్తిని చాటుకున్నారు.

శరన్నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజులపాటు ఉపవాస దీక్షలు పాటిస్తూ మహిళలు అమ్మవారిని ఆరాధిస్తున్నారు. కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామంలో శాంతి సౌభాగ్యాలు నెలకొనాలని వారు ప్రార్థించారు. రైతులకు మంచి పంటలు పండాలని, పాడిపంటలతో గ్రామాలు కళకళలాడాలని శారదాదేవిని వేడుకున్నారు.

నవరాత్రుల వేళ మహిళలు సామూహికంగా పూజల్లో పాల్గొనడంతో కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న అమ్మవారి పూజా కార్యక్రమాలతో భక్తులు దైవభక్తిని చాటుకుంటున్నారు. శారదాదేవి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మహిళలు ఆకాంక్షించారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE