e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

గ్రామస్థుల మూకదాడిలో మాజీ ఎమ్మెల్యే మృతి

రాజస్థాన్‌లో ఘటన.. స్టోన్ క్రషర్ పునఃప్రారంభంపై వివాదం

రాజస్థాన్: రాజస్థాన్‌లోని భౌండా గ్రామంలో జరిగిన ఘర్షణలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే అత్తర్ సింగ్ మృతి చెందినట్లు సమాచారం. గ్రామస్థులు చేసిన దాడిలో ఆయన తీవ్రంగా గాయపడగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

గ్రామంలోని గడ్డి భూములను ఆక్రమించి అక్రమంగా తవ్వకాలు చేపడుతున్నారంటూ అత్తర్ సింగ్‌పై స్థానికులు ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. గతంలో మూసివేసిన స్టోన్ క్రషర్‌ను తిరిగి ప్రారంభించడంతో గ్రామస్థులు ఆందోళనకు దిగారు.

ఈ క్రమంలో అత్తర్ సింగ్ తన అనుచరులతో కలిసి ఆందోళన చేస్తున్న వారిని అక్కడి నుంచి తొలగించేందుకు ప్రయత్నించడంతో వివాదం తలెత్తినట్లు సమాచారం. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఆయన గాయపడ్డారు. అనంతరం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం .

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, పోలీసుల అధికారిక ప్రకటన తెలియాల్సి ఉంది.

మీ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న రెడ్ బటన్ పై క్లిక్ చేసి మీరు వార్తలు పంపండి 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE