గ్రామస్థుల మూకదాడిలో మాజీ ఎమ్మెల్యే మృతి
రాజస్థాన్లో ఘటన.. స్టోన్ క్రషర్ పునఃప్రారంభంపై వివాదం రాజస్థాన్: రాజస్థాన్లోని భౌండా గ్రామంలో జరిగిన ఘర్షణలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే అత్తర్ సింగ్ మృతి చెందినట్లు సమాచారం. గ్రామస్థులు చేసిన దాడిలో ఆయన తీవ్రంగా గాయపడగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. గ్రామంలోని గడ్డి భూములను ఆక్రమించి అక్రమంగా తవ్వకాలు చేపడుతున్నారంటూ అత్తర్ సింగ్పై స్థానికులు ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. గతంలో మూసివేసిన స్టోన్ క్రషర్ను తిరిగి ప్రారంభించడంతో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో...