e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, October 13, 2026

కరువు మండలంగా ప్రకటించాలి..

తలమడుగు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి

పంట రుణాలు మాఫీ చేయాలి.. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

తహసీల్దార్‌కు ఆదివాసీ సంఘాల వినతి

మన భారత్, అక్టోబర్ 12, తలమడుగు:

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి, పంట నష్టాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మండలంలోని ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం (అక్టోబర్ 12) తలమడుగు తహసీల్దార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ.. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదైందని, దీంతో పంటల దిగుబడులు తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. సాగు కోసం పెట్టుబడులు పెట్టిన రైతులకు ఆశించిన స్థాయిలో పంటల పండకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వ్యవసాయం కోసం బ్యాంకులు, ఇతర మార్గాల ద్వారా అప్పులు తీసుకున్న రైతులు వాటిని తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పంట రుణాల నుంచి రైతులకు ఉపశమనం కల్పించాలి

పంటల దిగుబడులు తగ్గి అప్పుల భారం పెరిగిన నేపథ్యంలో రైతుల బ్యాంకు పంట రుణాలను మాఫీ చేసి ఆర్థికంగా ఆదుకోవాలని ఆదివాసీ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సహాయక చర్యలు చేపట్టాలని, వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం

అప్పుల బాధతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న రైతు మృతితో బాధిత కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు, వారి జీవనోపాధికి భరోసా కల్పించే చర్యలు తీసుకోవాలని కోరారు.

కరువు మండలంగా ప్రకటించి ప్రత్యేక సహాయం అందించాలి

తలమడుగు మండలంలో నెలకొన్న వ్యవసాయ పరిస్థితులను ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలించి, మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని నాయకులు కోరారు. పంట నష్టాలను అంచనా వేసి అర్హులైన రైతులకు పరిహారం అందించాలని, రైతులపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ రైతుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, సకాలంలో సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు కుమ్ర జ్ఞానేశ్వర్, మండల అధ్యక్షుడు జంగాల పోచన్న, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం భుజంరావు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ కార్యదర్శి ఆత్రం అంకుష్, ఝరి సర్పంచ్ రూపా కాశిరాం, పేందూరు జైతు పటేల్, పేందూరు మాధవరావు మహాజన్, నైతం రాము పటేల్, నైతం లక్ష్మణ్, సలాం రవీందర్, మెస్రం దేవరావు పటేల్, కోవా గోవిందరావు, మాజీ సర్పంచ్ మెస్రం విలాస్, సూర్యబాన్, సోయంమాణిక్ రావు, తుడసం హేమంత్, పేందూరు రాము తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE