e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, October 13, 2026

జగదాంబ దేవికి ఎమ్మెల్యే దంపతుల పూజలు

జగదాంబ దేవి ఆలయంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దంపతుల ప్రత్యేక పూజలు

జగదాంబ దేవి ఆలయంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దంపతుల ప్రత్యేక పూజలు

దేవి నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా బాల త్రిపుర సుందరి దేవికి మహాస్నపనం

మన భారత్, అక్టోబర్ 11, నేరడిగొండ: దేవి నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని తన స్వగ్రామం రాజురలో ఉన్న జగదాంబ దేవి ఆలయంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దంపతులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రుల తొలి రోజు అమ్మవారి బాల త్రిపుర సుందరి అవతారాన్ని దర్శించుకుని, భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.

నవరాత్రుల మొదటి రోజు సందర్భంగా జగదాంబ దేవి ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో అలంకరించిన దుర్గాదేవి విగ్రహానికి పంచామృతం, 11 ఔషధాలతో మహాస్నపనం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు సమర్పించారు.

ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గ ప్రజలందరిపై జగదాంబ దేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆకాంక్షించారు. నియోజకవర్గంలో ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం, అభివృద్ధి కలగాలని అమ్మవారిని ప్రార్థించారు.

దేవి నవరాత్రుల సందర్భంగా జగదాంబ దేవి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు. నవరాత్రుల తొలి రోజున బాల త్రిపుర సుందరి దేవి రూపంలో దుర్గాదేవిని పూజించడం ఆధ్యాత్మిక ప్రాధాన్యతను సంతరించుకుంది.

గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి 

జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE