e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, October 13, 2026

పత్తి పంట మధ్యలో గంజాయి సాగు.. 50 మొక్కలు స్వాధీనం

పత్తి పంట మధ్యలో గంజాయి సాగు.. 50 మొక్కలు స్వాధీనం

 పత్తి పంట మధ్యలో గంజాయి సాగు.. 50 మొక్కలు స్వాధీనం

అర్లి గ్రామ శివారులో పోలీసుల తనిఖీలు.. రూ.5 లక్షల విలువైన గంజాయి మొక్కలు పట్టివేత

 నిందితుడి అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు: తలమడుగు ఎస్‌ఐ డి. రాధిక

మన భారత్, తలమడుగు, అక్టోబర్ 11: పత్తి పంట సాగు చేస్తున్న వ్యవసాయ భూమిలో అక్రమంగా గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తిని తలమడుగు పోలీసులు పట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం అర్లి గ్రామ శివారులో నిర్వహించిన తనిఖీల్లో పత్తి పంట మధ్యలో సాగు చేస్తున్న 50 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తలమడుగు ఎస్‌ఐ డి. రాధిక తెలిపారు.

 పత్తి పంట మధ్యలో గంజాయి మొక్కల గుర్తింపు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్లి గ్రామ శివారులోని వ్యవసాయ భూమిలో గంజాయి సాగు చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం అందడంతో తలమడుగు ఎస్‌ఐ డి. రాధిక పోలీసు సిబ్బందితో కలిసి అనుమానిత వ్యవసాయ భూమిలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పత్తి పంట మధ్యలో అక్కడక్కడ గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు గుర్తించారు.

వెంటనే పంచుల సమక్షంలో మొక్కలను పరిశీలించి, మొత్తం 50 గంజాయి మొక్కలను లెక్కించారు. వాటికి నంబర్లు వేసి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కల విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని అంచనా వేసినట్లు పోలీసులు వెల్లడించారు.

రెండు ఎకరాలకు పైగా భూమిలో సాగు

ఈ కేసులో నిందితుడిగా గుర్తించిన వ్యక్తి అర్లి గ్రామానికి చెందిన చింతలపల్లి రాజారెడ్డి (65), తండ్రి చింతలపల్లి వెంకటరెడ్డిగా పోలీసులు తెలిపారు. తనకు చెందిన సర్వే నంబర్ 62/A/1లోని 2 ఎకరాల 23 గుంటల వ్యవసాయ భూమిలో పత్తి పంటతో పాటు గంజాయి మొక్కలను సాగు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు.

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి మొక్కలను పెంచినట్లు నిందితుడు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. పత్తి పంట మధ్యలో గంజాయి మొక్కలను పెంచుతూ ఇతరుల దృష్టికి రాకుండా సాగు చేసినట్లు వెల్లడించారు.

కేసు నమోదు.. నిందితుడు రిమాండ్‌కు

గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్న అనంతరం నిందితుడిపై తలమడుగు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ డి. రాధిక వెల్లడించారు.

గంజాయి సాగుపై కఠిన చర్యలు

ప్రభుత్వం నిషేధించిన గంజాయి సాగు, విక్రయాలు, రవాణాకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ డి. రాధిక హెచ్చరించారు. అక్రమ గంజాయి సాగు లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసినవారు 8412659973 నంబర్‌కు వాట్సాప్ ద్వారా తెలియజేయాలని సూచించారు. ఈ నంబర్ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

గంజాయి సాగుకు పాల్పడే వారికి ప్రభుత్వ పథకాలు వర్తించకుండా చర్యలు తీసుకునేలా సిఫార్సు చేస్తామని పేర్కొన్నారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ గంజాయికి దూరంగా ఉండాలని, గంజాయి రహిత జిల్లాను నిర్మించేందుకు పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.

 

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE