e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

సబ్ స్టేషన్ ల మంజూరి పట్ల హర్షం..

రెండు సబ్ స్టేషన్ ల మంజూరి పట్ల హర్షం.

ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూడిది రాజేందర్

రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 04 (మన భారత్ ప్రతినిధి): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పదిర,బండలింగంపల్లి గ్రామాలకు రెండు సబ్ స్టేషన్లు మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూడిద రాజేందర్ ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండలింగంపల్లి గ్రామంలో 2 కోట్ల 70 లక్షల రూపాయల వ్యయంతో సబ్ స్టేషన్ నిర్మాణం అవుతుందన్నారు.అలాగే పదిర, హరిదాస్ నగర్ గ్రామాలకు 3 కోట్ల 14 లక్షల రూపాయలతో సబ్ స్టేషన్ నిర్మాణం చేపడతారని తెలిపారు.ఈ రెండు సబ్ స్టేషన్ ల నిర్మాణాలతో మండలంలో లో వోల్టేజ్ సమస్య తీరుతుందని అన్నారు. ఈ సబ్ స్టేషన్ల మంజూరి కి సహకరించిన విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, ఎన్పీడీసీఎల్ అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.ఈ సమావేశంలో మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య,నాయకులు గుండాడి రామ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి,షేక్ గౌస్,సద్ది లక్ష్మారెడ్డి, ఎస్.కె సాహెబ్,నంది కిషన్, మెండే శ్రీనివాస్ యాదవ్,లింగం గౌడ్,శ్రీనివాస్, నారాయణ, రాములు,మూర్తి వెంకటేష్,వంగ శ్రీకాంత్ రెడ్డి,వెంకటేష్,సంతోష్, పోచయ్య, శ్రీనివాస్, నరేందర్, ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.

మీ ఓగ్గు  మహేష్ చంద్ర , మన భారత్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్, రాజన్న సిరిసిల్ల.

జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE