e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ను వెంటనే అమలు చేయాలి

దసరా తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

మన భారత్, రామాయంపేట: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రకటించిన రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ను ప్రస్తుత ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రామాయంపేటలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదని నాయకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు పరిపాలనా సేవలు మరింత చేరువవుతాయని అన్నారు. ప్రజల దీర్ఘకాలిక డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వం రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ను ప్రకటించిందని తెలిపారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని అమలు చేయడంలో జాప్యం చేస్తోందని ఆమె విమర్శించారు.

రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే దసరా పండుగ అనంతరం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఉద్యమంలో కుల సంఘాలు, విద్యార్థులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున పోరాటం చేపడతామని పేర్కొన్నారు.

రెవెన్యూ డివిజన్ ఏర్పాటు వల్ల రామాయంపేటతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కలుగుతుందని నాయకులు తెలిపారు. చిన్నచిన్న రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ప్రెస్‌మీట్‌లో మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ బాదే చంద్రం, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, సుప్రభాత్ రావు, ఉమామహేశ్వర్, శ్రీకాంత్ సాగర్, అస్నుద్దీన్, దోమకొండ శ్రీను, గణపురం కృష్ణగౌడ్, రొయ్యల నవీన్, మధ్యల రమేష్, కృష్ణగౌడ్‌తో పాటు టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE