రామాయంపేట రెవెన్యూ డివిజన్ను వెంటనే అమలు చేయాలి
దసరా తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మన భారత్, రామాయంపేట: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రకటించిన రామాయంపేట రెవెన్యూ డివిజన్ను ప్రస్తుత ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో రామాయంపేటలో ప్రెస్మీట్ నిర్వహించారు. రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ.. రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయడం వల్ల...