బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం..

Published on

-Advertisement-

రిమ్స్‌ NICU ఘటనాస్థలిని పరిశీలించిన డీసీసీ అధ్యక్షుడు నరేష్‌ జాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌ శ్రీకాంత్‌ రెడ్డి

చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో ఆరా..

మన భారత్, సెప్టెంబర్ 23, ఆదిలాబాద్. ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలోని నియోనేటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (NICU)లో ఇటీవల చోటుచేసుకున్న విషాద ఘటన నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు డా. సినిమా నరేష్‌ జాదవ్‌, ఆదిలాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి బాధిత చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ఘటన అనంతరం అస్వస్థతకు గురై ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారులను వారు పరామర్శించి, అందుతున్న వైద్య సేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

చిన్నారులకు అందిస్తున్న చికిత్స, వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, వైద్యుల పర్యవేక్షణ తదితర అంశాలపై ఆసుపత్రి వైద్యులతో వారు వివరంగా మాట్లాడారు. బాధిత చిన్నారుల కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. చిన్నారుల ఆరోగ్యంపై వైద్యులు నిరంతరం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

అనంతరం నరేష్‌ జాదవ్‌, బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి రిమ్స్‌ ఆసుపత్రికి చేరుకుని ఘటన చోటుచేసుకున్న NICU ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన పరిస్థితులను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అవసరమైన ప్రభుత్వ సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు వైద్యపరంగా అవసరమైన సహాయం అందించడంతో పాటు, వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయాన్ని సమన్వయం చేసేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అల్లూరి సంజీవ రెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయ ఇన్‌చార్జి గౌలి సంజీవ్‌ కుమార్‌, మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు అనిల్‌ కుమార్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖిజార్‌ పాషా, యూత్‌ కాంగ్రెస్‌ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు రూపేష్‌ రెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ ఎస్సీ విభాగం అధ్యక్షుడు పరమేశ్వర్‌, జనరల్‌ సెక్రటరీ దేవిదాస్‌ చారి, మందాకిని, వార్డు అధ్యక్షులు తుమ్మ విశాల్‌, బండి సంజయ్‌, జహీర్‌తో పాటు పలువురు జిల్లా కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

ఆ కౌన్సిలర్ పై కేసు నమోదు..

పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు గణపతి నిమజ్జన బందోబస్తులో ఆటంకాలు.. ముగ్గురిపై కేసులు నమోదు మద్యం సేవించి ప్రజాశాంతికి...

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంలో ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి.. 200...

ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం

నెల రోజుల్లోనే వ్యవసాయ విద్యుత్‌ సౌకర్యం.. ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం డీడీలు చెల్లించిన వెంటనే స్పందన.. ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు...

రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ..

గిన్నెరలో రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ చిన్నారి తల్లి, కుటుంబ సభ్యులకు ధైర్యం.. అండగా ఉంటామని భరోసా...

More like this

ఆ కౌన్సిలర్ పై కేసు నమోదు..

పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు గణపతి నిమజ్జన బందోబస్తులో ఆటంకాలు.. ముగ్గురిపై కేసులు నమోదు మద్యం సేవించి ప్రజాశాంతికి...

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంలో ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి.. 200...

ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం

నెల రోజుల్లోనే వ్యవసాయ విద్యుత్‌ సౌకర్యం.. ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం డీడీలు చెల్లించిన వెంటనే స్పందన.. ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు...