సమస్యలను వెంటనే పరిష్కరించాలి..

Published on

-Advertisement-

మన భారత్,చిట్యాల:

మండల కేంద్రంలోని సివిల్ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా వైద్యా అధికారికి డిఎంహెచ్వో వినతి పత్రం అందజేయడం జరిగింది.

సివిల్ ఆస్పత్రికి చిట్యాల మండలంతో పాటు పరిసర గ్రామాల నుంచి ప్రతిరోజూ అనేక మంది ప్రజలు వైద్యం కోసం వస్తున్నారని, అయితే ఆస్పత్రిలో కనీస సౌకర్యాల విషయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ముఖ్యంగా ఆస్పత్రిలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించి, రోగులు, వారి సహాయకులు మరియు ఆస్పత్రికి వచ్చే ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గత ఆరు నెలలుగావాటర్ ఫిల్టర్/RO సౌకర్యం పనిచేయక పోవడంతో ప్రజలు బయట నుండి నీరు తెచ్చుకునే పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి వెంటనే నీటి నిల్వ సదుపాయాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ఆస్పత్రులకు పేద, మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా వస్తారని, వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.

చిట్యాల సివిల్ ఆస్పత్రిలోని సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని డివైఎఫ్ఐ డిమాండ్ చేసింది. సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రజలతో కలిసి తదుపరి కార్యాచరణ చేపడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి భూక్య నవీన్ తదితర నాయకులు పాల్గొన్నారు.

మీ శీలపాక రాజు మన భారత్ రిపోర్టర్ చిట్యాల

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

ఆ కౌన్సిలర్ పై కేసు నమోదు..

పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు గణపతి నిమజ్జన బందోబస్తులో ఆటంకాలు.. ముగ్గురిపై కేసులు నమోదు మద్యం సేవించి ప్రజాశాంతికి...

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంలో ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి.. 200...

ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం

నెల రోజుల్లోనే వ్యవసాయ విద్యుత్‌ సౌకర్యం.. ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం డీడీలు చెల్లించిన వెంటనే స్పందన.. ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు...

రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ..

గిన్నెరలో రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ చిన్నారి తల్లి, కుటుంబ సభ్యులకు ధైర్యం.. అండగా ఉంటామని భరోసా...

More like this