e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దాం : రవి పటేల్

మన భారత్,మొగుళ్ళపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ… చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజల హక్కుల కోసం, పేదలు మరియు అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం ధైర్యంగా పోరాడిన మహా వీరనారి అని కొనియాడారు. భూస్వామ్య దోపిడీకి, అన్యాయానికి వ్యతిరేకంగా ఆమె చూపిన ధైర్యం, తెగువ నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.చాకలి ఐలమ్మ పోరాటం కేవలం ఒక వ్యక్తి పోరాటం కాదని, పేదలు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం సాగిన సామాజిక పోరాటానికి ప్రతీక అని అన్నారు.నేటి సమాజంలో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మరియు అణగారిన వర్గాలకు సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం దక్కాల్సిన అవసరం ఉందన్నారు. చాకలి ఐలమ్మ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సామాజిక న్యాయం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని తెలిపారు.
“చాకలి ఐలమ్మ చూపిన పోరాట మార్గం మనకు స్ఫూర్తి. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆమెకు మనం ఇచ్చే నిజమైన నివాళి” అని రవి పటేల్ అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ఉప అధ్యక్షుడు ఇనుగల ప్రణయ్ రాజ్ ,మండల నాయకులు,గంధం సతీష్ ,యువజన పిట్టల రాంబాబు ,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ,పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE