చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దాం : రవి పటేల్
మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా: వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ... చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజల హక్కుల కోసం, పేదలు మరియు అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం ధైర్యంగా పోరాడిన మహా వీరనారి అని కొనియాడారు. భూస్వామ్య దోపిడీకి, అన్యాయానికి వ్యతిరేకంగా ఆమె...