తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె సేవలు మరువలేనివి
మన భారత్, సెప్టెంబర్ 10, తలమడుగు:
తెలంగాణ సాయుధ పోరాటంలో ధైర్యసాహసాలతో పోరాడిన చాకలి ఐలమ్మ త్యాగాలు చిరస్మరణీయమని సంఘం నాయకులు పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని తలమడుగులో సంఘం నాయకులు, గ్రామస్తులు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ముందుగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె చేసిన పోరాటాన్ని, సామాజిక ఉద్యమంలో అందించిన సేవలను నాయకులు స్మరించుకున్నారు.
నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో చాకలి ఐలమ్మ చూపిన తెగువ, ధైర్యం, అణగారిన వర్గాల కోసం ఆమె సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. అన్యాయానికి, దోపిడీకి వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు.
చాకలి ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు యువత, ప్రజలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం అందరూ ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
అలాగే హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐలమ్మ సేవలకు, పోరాట స్ఫూర్తికి తగిన గుర్తింపు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెలుగు రాజన్న (చంటి) తో పాటు కొత్తూరు సర్పంచ్ జాలరాపు చంద్రశేఖర్, గ్రామస్తులు, యువత, పెద్దలు, సంఘం నాయకులు, తదితరులు పాల్గొని చాకలి ఐలమ్మకు ఘన నివాళులు అర్పించారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
