e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీని నడుపుతారా.?

ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీని నడుపుతారా.?

మన భారత్,మొగుళ్ళపల్లి:

100 రోజులు చెప్పి 1000 రోజులైనా హామీలను నెరవేర్చని కాంగ్రెస్ అసమర్ధ పాలనపై నిరసన తెలుపుతూ..బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల టీ షర్టులు ధరించి అసెంబ్లీకి వెళుతుంటే..వేలాది మంది పోలీసులను అడ్డుపెట్టుకొని..అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను అక్రమంగా అరెస్టు చేశారని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అక్రమ అరెస్టును నిరసిస్తూ..భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపు మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు నేతృత్వంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్, మాజీ జెడ్పిటిసి జోరుక సదయ్యలు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు..అక్రమ అరెస్టులకు తెరలేపారని మండిపడ్డారు. ప్రజా ప్రతినిధులను, బీఆర్ఎస్ నాయకులను అసెంబ్లీకి రానీయకుండా అడ్డుకున్నంత మాత్రాన తమ పోరాటం ఆగిపోదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరంతరం ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు. ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీని నడుపుతారా..? అంటూ నిలదీశారు. ఇదేనా ప్రజాస్వామ్యం..? ఇదేనా మీ ప్రజా పాలన అంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ నల్ల టీ షర్టు వేసుకొని పార్లమెంటుకు వెళ్లొచ్చు..కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రం నల్ల టీ షర్టులతో అసెంబ్లీకి వెళ్లొద్దా..? అని వారు ప్రశ్నించారు. 100 రోజులు చెప్పి.. 1000 రోజులైనా హామీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరుగు తిరుగుబావుటా ఎగురవేసి..కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు.

అనంతరం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి 420 మోసపూరితమైన హామీలనిచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి..ప్రజలకు బాకీ పడ్డ పథకాలను అమలు చేయాలని బాకీ కార్డు ద్వారా మండల నోడల్ అధికారికి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి, నైనకంటి ప్రభాకర్ రెడ్డి, దానబోయిన రాములు, పెంతల రాజేందర్ రెడ్డి, గుడిమల్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE