e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 17, 2026

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక విఫల సీఎం..

మన భారత్,మొగుళ్ళపల్లి:

గ్యారెంటీల ప్రకారం బకాయిలు చెల్లించాలని డిమాండ్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షులు బలుగూరి తిరుపతి రావు ఆధ్వర్యంలో మొగుళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన తీరును ప్రజలకు వివరించారు,ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి జోరుక సదయ్య, చిట్యాల వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్ పాల్గొన్నారు
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు సంబంధించిన “కాంగ్రెస్ బాకీ కార్డులు” పంపిణీ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొన్నదని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు.
మండల పార్టీ అధ్యక్షులు బల్గూరి తిరుపతిరావు మాట్లాడుతూ..

కాంగ్రెస్ బాకీ కార్డులోని ప్రధాన హామీలు:

1. మహిళలకు నెలకు ₹2,500 ఇస్తామన్న హామీ — 33 నెలలకు ₹82,500 బాకీ.
2. వృద్ధులు, బీడీ కార్మికులకు నెలకు ₹4,000 పెన్షన్ ఇస్తామన్న హామీ — 33 నెలలకు ₹66,000 బాకీ.
3. దివ్యాంగులకు నెలకు ₹6,000 పెన్షన్ ఇస్తామన్న హామీ — 33 నెలలకు ₹66,000 బాకీ.
4. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలలో ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తామన్న హామీ — బాకీ.
5. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్న హామీ — బాకీ.
6. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద కాలేజీ విద్యార్థుల ఫీజులు చెల్లిస్తామన్న హామీ — ₹12 వేల కోట్ల బకాయి ఉందని పేర్కొన్నారు.
7. రైతు భరోసా కింద 4 ఎకరాల రైతుకు ₹1,02,000 బకాయి, అలాగే ₹2 లక్షల రుణమాఫీ హామీ బాకీ.
8. వరి పంటకు క్వింటాల్‌కు ₹500 బోనస్ హామీ ప్రకారం, ప్రతి ఎకరాకు ₹12,500 చొప్పున ఆరు పంటలకు ₹75,000 బాకీ.
9. రైతు కూలీలకు సంవత్సరానికి ₹12,000 ఇస్తామన్న హామీ — రెండు సంవత్సరాలకు ₹24,000 బాకీ.
10. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ బాకీ. అలాగే నిరుద్యోగ భృతి నెలకు ₹4,000 చొప్పున 33 నెలలకు ₹1,32,000 బాకీ.
11. విద్యా భరోసా కార్డు ద్వారా విద్యార్థులకు ₹5 లక్షలు అందిస్తామన్న హామీ — బాకీ.
12. ఆటో కార్మికులకు సంవత్సరానికి ₹12,000 ఇస్తామన్న హామీ — రెండు సంవత్సరాలకు ₹24,000 బాకీ.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేసి, ప్రజలకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో, నాయకులు నైనకంటి ప్రభాకర్ రెడ్డి, సంజీవరావు,బత్తిని శ్రీహరి గౌడ్, పెంతల రాజేందర్ రెడ్డి, దానబోయిన రాములు, బద్దం జైపాల్ రెడ్డి, గడ్డం రాజు గౌడ్, పెంతల మల్లారెడ్డి, ముడుపు రవీందర్రెడ్డి, దేవునూరి కుమార్, మాదం సురేష్, రేళ్ళ రమేష్, మండల నాయకులు గ్రామ నాయకులు పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE