e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, October 15, 2026

జీవో 97ను తక్షణమే రద్దు చేయాలి..

పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయొద్దు: బోనగిరి రాజేష్

మన భారత్,మొగుళ్ళపల్లి:

పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా టిఆర్పి మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు బోనగిరి రాజేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థుల విద్యా భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ విద్యకు ఉన్న ప్రత్యేకతను కాపాడుతూ, విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం భరోసా కల్పించాలని కోరారు.పాలిటెక్నిక్ విద్యను ప్రస్తుత ఎస్బి టెట్ ,పరిధిలోనే కొనసాగించాలని రాజేష్ డిమాండ్ చేశారు.విద్యార్థులకు ఈసెట్ , ద్వారా ఉన్నత విద్యలో ప్రవేశ అవకాశాలు, స్కాలర్‌షిప్‌లు, రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, డిప్లొమా గుర్తింపు, ఉద్యోగ అవకాశాలు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు.

విద్యార్థుల భవిష్యత్తు, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని GO 97ను వెంటనే రద్దు చేయాలని ఆయన కోరారు. అలాగే, అవసరమైతే పాలిటెక్నిక్ విద్య స్వతంత్రతను కాపాడేందుకు ఇంటర్మీడియట్ బోర్డు తరహాలో ప్రత్యేక పాలిటెక్నిక్ బోర్డును ఏర్పాటు చేయాలని బోనగిరి రాజేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE