e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

చిల్కూరి భూమన్న కుటుంబాన్ని పరామర్శించిన రాథోడ్ బాపురావు

బజార్హత్నూర్, ఆగస్టు 22: బజార్హత్నూర్ మండలానికి చెందిన చిల్కూరి భూమన్న మాతృమూర్తి ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రక్షణ సేన బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు వారి స్వగ్రామంలోని నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్న రాథోడ్ బాపురావు, భూమన్న కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని, మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా రాథోడ్ బాపురావు మాట్లాడుతూ.. కుటుంబంలో పెద్దను కోల్పోవడం ఎంతో బాధాకరమైన విషయమని, ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు తన అండగా ఉంటానని తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో డాక్టర్ అంకుష్, ఉశన్న, రాజారెడ్డి, సంతోష్, శివ, గణేష్, విఠల్ తో పాటు తెలంగాణ రక్షణ సేన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE