e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

పోస్టల్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.1 లక్ష మోసం.. నిందితుడి అరెస్ట్

మన భారత్, ఆదిలాబాద్: పోస్టల్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.1 లక్ష తీసుకుని మోసం చేసిన ఘటనపై గుడిహత్నూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్ తెలిపారు.

ఉద్యోగం పేరుతో డబ్బులు వసూలు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నూర్ గ్రామానికి చెందిన భూరే స్వప్నిల్‌కు అదే గ్రామానికి చెందిన పడ్ రాజు పోస్టల్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించినట్లు ఫిర్యాదు అందింది. ఉద్యోగం ఇప్పించేందుకు రూ.1 లక్ష చెల్లించాలని నిందితుడు కోరినట్లు పోలీసులు తెలిపారు.

దీంతో బాధితుడు తన తల్లి తేజమ్మకు చెందిన తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఖాతా నుంచి 2018 మే 11న నిందితుడి ఖాతాకు రూ.1 లక్ష బదిలీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే డబ్బులు తీసుకున్న అనంతరం ఉద్యోగం ఇప్పించకపోవడంతో పాటు తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వకుండా నిందితుడు మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

కేసు నమోదు.. నిందితుడి అరెస్ట్

బాధితుడి ఫిర్యాదు మేరకు గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 231/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంబంధిత వివరాలను పరిశీలించిన పోలీసులు నిందితుడిగా గుర్తించిన మన్నూర్ గ్రామానికి చెందిన పడ్ రాజు, తండ్రి లేట్ రఘునాథ్ ను అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు.

ఉద్యోగాల పేరుతో మోసాలకు అప్రమత్తంగా ఉండాలి

ఈ సందర్భంగా ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే మధ్యవర్తులు, వ్యక్తులను నమ్మి ముందుగానే డబ్బులు చెల్లించవద్దని సూచించారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రభుత్వ అధికారిక నోటిఫికేషన్లు, అధికారిక వెబ్‌సైట్లు, నిర్దేశిత నియామక ప్రక్రియను మాత్రమే నమ్మాలని కోరారు.

ఉద్యోగం ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినా, అనుమానాస్పదంగా వ్యవహరించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. యువత ఉద్యోగాల కోసం ప్రయత్నించే సమయంలో ఇలాంటి మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు.

ఈ కేసు దర్యాప్తులో గుడిహత్నూర్ ఎస్సై ఎల్. శ్రీకాంత్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జ్.

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE