కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్‌ పథకాలు బంద్.. అసలు కారణం ఏమిటి?

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్: 

తెలంగాణలో పేద కుటుంబాల ఇంట్లో పెళ్లిళ్లకు ఆర్థిక భరోసానిచ్చే ‘కల్యాణలక్ష్మి’, ‘షాదీ ముబారక్’ పథకాల అమలుపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అయిన తెలంగాణ హైకోర్టు అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ రెండు పథకాల కింద లబ్ధిదారులకు ఎలాంటి నగదు చెల్లింపులు చేయవద్దని స్పష్టం చేస్తూ తాత్కాలిక ఇంజక్షన్ జారీ చేసింది. దీంతో ఇప్పటికే దరఖాస్తు చేసుకుని నిధుల కోసం ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. అసలు హైకోర్టు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఈ పథకం పూర్తిగా నిలిపివేయనున్నారా?

అసలు కోర్టు వరకు ఎందుకు వెళ్లింది?

న్యాయవాది విజయ్ గోపాల్ వ్యక్తిగత హోదాలో తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. 2014 నుంచి అమలు చేస్తున్న ఈ పథకాలకు అసెంబ్లీలో ఎలాంటి ప్రత్యేక చట్టం లేదా తీర్మానం లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల (జీవోల) ఆధారంగానే రూ.13,000 కోట్లకు పైగా ప్రజాధనాన్ని ఖర్చు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ వాదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 202(3), 204(3), 266(3), 283(2) నియమాలను ఉల్లంఘిస్తూ, చట్టసభల అధికారాన్ని కార్యనిర్వాహక వర్గం తన చేతుల్లోకి తీసుకుందని పేర్కొన్నారు.

కోర్టు సీరియస్.. స్టే విధించడానికి ప్రధాన కారణం ఇవే

ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని గతంలోనే జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ ధర్మాసనం ఆదేశించింది. జూలై 8న సమయం ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం స్పందించలేదు. తాజాగా బుధవారం జరిగిన విచారణలో కూడా ప్రభుత్వం తరఫు న్యాయవాది మరికొంత సమయం కోరడంతో ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దాంతో 2014 నుండి 2019 వరకు ఈ పథకాల కోసం జారీ చేసిన 8 జీవోల అమలుపై స్టే విధించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ కేసు విచారణను సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు ఈ పథకం ప్రయోజనాలు నిలిచిపోనున్నాయి.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

నిరుపేద విద్యార్థులకు అండగా బీఎస్పీ..

పేద విద్యార్థులకు బీఎస్పీ విద్యా సామగ్రి పంపిణీ ఆదిలాబాద్:మన భారత్ ఆగస్టు 24, పేద, నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో...

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుల్లపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తాపీ...

ప్లాట్ విక్రయిస్తానని రూ.5.70 లక్షలు వసూలు..

రియల్ ఎస్టేట్ ఏజెంట్ అరెస్ట్ ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 23: ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు...

అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు: సీఐ

తలమడుగులో 300 కిలోల పిడిఎస్ బియ్యం పట్టివేత.. ఒకరి అరెస్ట్ తలమడుగు, ఆగస్టు 23: పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌ (PDS)...

More like this