e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

విద్యా కమిషన్ ప్రతిపాదనలపై టీఆర్ఎస్ ఆందోళన..

ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నాం.. విద్యా కమిషన్ ప్రతిపాదనలపై తెలంగాణ రక్షణ సేన ఆందోళన

మన భారత్, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థకు సంబంధించిన ప్రతిపాదిత మార్పులపై తెలంగాణ రక్షణ సేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విద్యా కమిషన్ నివేదిక పేరుతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, అలాంటి చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

తెలంగాణ రక్షణ సేన నాయకులు మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేయడం లేదా సంఖ్యను గణనీయంగా తగ్గించడం వల్ల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన సమయంలో పాఠశాలల సంఖ్యను తగ్గించే విధానాలను పునఃసమీక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.

అలాగే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రైవేట్ విద్యాసంస్థలకు అనుకూలంగా ఉన్నాయనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన నిధులు, మౌలిక వసతులు, ఉపాధ్యాయుల నియామకాలపై దృష్టి సారించకుండా, విద్యా వ్యవస్థలో మార్పులకు ప్రాధాన్యం ఇవ్వడం సరైన విధానం కాదని విమర్శించారు.

బడ్జెట్ పాఠశాలలకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని తెలంగాణ రక్షణ సేన డిమాండ్ చేసింది. అలాగే, ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేసి, గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలని కోరింది.

ప్రభుత్వ పాఠశాలల మూసివేత లేదా విలీనానికి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు వ్యతిరేకిస్తారని, విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సంస్థ నాయకులు పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో పని చేయుటకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్స్, నియోజకవర్గాలు, మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE