విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేసి

Published on

-Advertisement-

కొర్కిశాల కేజీబీవీని ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

మన భారత్,మొగుళ్ళపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొర్కిశాల గ్రామంలోని కేజీబీవీ పాఠశాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగాఎమ్మెల్యే విద్యార్థులతో మాట్లాడి విద్యాబోధన, భోజన సదుపాయాలు, వసతి మరియు ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు నీటి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వెంటనే సంబంధిత మిషన్ భగీరథ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణమే తాగునీటి సదుపాయం కల్పించాలని సూచించారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం అమలు చేస్తున్న విద్యా, సంక్షేమ పథకాలు సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వార్డెన్లు, ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం విద్యార్థులకు అందించిన స్నాక్స్‌ను వారితో కలిసి ఎమ్మెల్యే తిన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదికారులు, ప్రజా ప్రతినిధులు పాలొన్నారు.

Latest articles

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

గ్రామ పంచాయతీలకు శుభవార్త..

ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం కీలక నిర్ణయం పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు రంగం సిద్ధం.. గ్రామాభివృద్ధి పనులకు నిధుల వినియోగం...

మీరు రిపోర్టర్ కావాలని అనుకుంటున్నారా.!

రిపోర్టర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా? ఇదే మీకు సువర్ణావకాశం! సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకురావాలనే ఆసక్తి ఉన్న వారికి 'మన భారత్'లో...

నకిలీ రూ.500 నోటు కలకలం..

ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ రూ.500 నోటు కలకలం బ్యాంకులో గుర్తించిన అధికారులు.. నగదు లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలని సూచన మన భారత్, ఆసిఫాబాద్: కొమురం...

More like this