e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, October 18, 2026

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీఐ దగ్గు మల్లేష్

మాదకద్రవ్యాల నిర్మూలనకు యువత నడుం బిగించాలి

మత్తు పదార్థాలపై పోలీసులకు సమాచారం అందించాలి

పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిట్యాల సీఐ దగ్గు మల్లేష్

మన భారత్,మొగుళ్ళపల్లి:

ప్రస్తుతం సమాజంలో పెనుభూతంగా మారిన మాదకద్రవ్యాల మహమ్మారిని అంతమొందించేందుకు యువత, విద్యార్థులు సరిహద్దుల్లో పోరాడే సైనికుల్లా కదలాలని చిట్యాల సీఐ దగ్గు మల్లేష్ పిలుపునిచ్చారు. ఆదివారం చిట్యాల పోలీస్ స్టేషన్ లోని తన చాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా దినోత్సవాన్ని పురస్కరించుకొని చిట్యాల సర్కిల్ పరిధిలోని ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధిలో గల విద్యాసంస్థల్లో, గ్రామాలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అవగాహన సదస్సులను నిర్వహించి డ్రగ్స్ రహిత ప్రాంతంగా చిట్యాల సర్కిల్ ను తీర్చిదిద్దబోతున్నట్లు ఆయన తెలిపారు.

ఈ అవగాహన కార్యక్రమాల్లో విద్యార్థులు, యువకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ఆహ్వానించి “డ్రగ్స్ వద్దు..ఆరోగ్యమే ముద్దు” అంటూ వారితో ర్యాలీలు నిర్వహించి..నినాదాలు చేయించామని తెలిపారు. యువత క్షణికావేశంలో లేదా సరదా కోసమో మత్తు పదార్థాల జోలికి వెళ్లి తమ ఉజ్వల భవిష్యత్తును అందకారం చేసుకోవద్దని హితవు పలికారు. డ్రగ్స్ విక్రయాలు, రవాణా వినియోగం వంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడి జీవితాలను చిక్కుల్లో పడేసుకోవద్దన్నారు.

విద్యార్థులు కేవలం చదువులపైనే శ్రద్ధ పెట్టాలని, ఉన్నత ఆశయాల సాధనకు కృషి చేయాలన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి నడుం బిగించాలన్నారు. మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై సమాజంలోని ప్రతి వర్గం నిరంతరం చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. యువత మత్తుకు బానిసలైతే ఆయా కుటుంబాలు ముఖ్యంగా కన్న తల్లులు అనుభవించే వేదన వర్ణనాతీతమన్నారు. ప్రతి ఒక్కరూ డ్రగ్స్ కు ఆమడ దూరంలో ఉంటూ, దేశ ప్రగతికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, మత్తు పదార్థాల దుష్పరిణామాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడమే కాకుండా, ఇతరులను సైతం చైతన్య పరచాలని, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం కోసం యువత బాధ్యతయుతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల వినియోగంపై పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE