రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు

Published on

-Advertisement-

మన భారత్, తాంసి

జొన్న కొనుగోళ్లలో జాప్యంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన లీడర్ కృష్ణ రత్న ప్రకాష్

తాంసి మండల కేంద్రంలోని జొన్న మార్కెట్ యార్డులో రైతులు చేపడుతున్న ఆందోళనకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పూర్తి మద్దతు ఉంటుందని BRS పార్టీ మండల మాజీ కన్వీనర్, మాజీ సర్పంచ్ కృష్ణ రత్న ప్రకాష్ తెలిపారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు రైతులకు అండగా నిలుస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

గురువారం మార్కెట్ యార్డును సందర్శించిన కృష్ణ రత్న ప్రకాష్, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం రైతుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జొన్న పంట కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు పంటల కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని ఆయన పేర్కొన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేసి వారి శ్రమకు తగిన గౌరవం ఇచ్చేదని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు మార్కెట్ యార్డుల్లో రోజులు తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.

జొన్న కొనుగోళ్లలో పారదర్శకత, వేగవంతమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని, రైతుల హక్కుల కోసం ఎప్పటికీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

మార్కెట్ యార్డులో కొనసాగుతున్న ఆందోళన నేపథ్యంలో రైతులకు భోజన సదుపాయం కల్పించడం ద్వారా వారి పట్ల సంఘీభావం ప్రకటించినట్లు తెలిపారు. రైతులు ధైర్యంగా ఉండాలని, వారి సమస్యల పరిష్కారం కోసం అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చారు.

రైతులకు అన్నదానం ప్రతిరోజు చేస్తున్నడంతో బీఆర్ఎస్ నాయకులను రైతులు అభినందించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఓట్ల కోసమే వస్తారని రైతులు గుర్తుచేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు కేమ సాయినాథ్, ఆనంద్, మలపతి అశోక్, వినోద్ రెడ్డి, రఘు, అండె అశోక్, లక్ష్మీపతి, భోజన్న, సోను, మహేందర్‌ , అరుణ్ కుమార్, తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

కన్న తండ్రే.. బాలికపై లైంగిక దాడి

మన భారత్, గుజరాత్:  14 ఏళ్ల బాలికపై తండ్రి లైంగిక దాడి.. పోక్సో చట్టం కింద కేసు నమోదు నవసారి, జూన్...

ఆరు వరుసల వంతెనకు గ్రీన్ సిగ్నల్..

మన భారత్, హైదరాబాద్ కాటేదాన్–శంషాబాద్ మార్గంలో ఆరు లేన్ల వంతెనకు గ్రీన్ సిగ్నల్ రూ.189.68 కోట్లతో గ్రేడ్ సెపరేటర్ నిర్మాణం.. విమానాశ్రయానికి...

మొబైల్ వినియోగదారులకు మరో షాక్..

మన భారత్ మొబైల్ వినియోగదారులకు మరోసారి రీఛార్జ్ ధరల షాక్.. 3-6 నెలల్లో టారిఫ్ పెంపు అవకాశం దేశంలోని మొబైల్ వినియోగదారులకు...

“అమ్మ పేరుతో ఒక మొక్క” నాటిన నేతలు

మన భారత్, గజపతినగరం "అమ్మ పేరుతో ఒక మొక్క" కార్యక్రమంలో భాగంగా మొక్కల నాటకం గజపతినగరం, జూన్ 5: ప్రపంచ పర్యావరణ...

More like this

కన్న తండ్రే.. బాలికపై లైంగిక దాడి

మన భారత్, గుజరాత్:  14 ఏళ్ల బాలికపై తండ్రి లైంగిక దాడి.. పోక్సో చట్టం కింద కేసు నమోదు నవసారి, జూన్...

ఆరు వరుసల వంతెనకు గ్రీన్ సిగ్నల్..

మన భారత్, హైదరాబాద్ కాటేదాన్–శంషాబాద్ మార్గంలో ఆరు లేన్ల వంతెనకు గ్రీన్ సిగ్నల్ రూ.189.68 కోట్లతో గ్రేడ్ సెపరేటర్ నిర్మాణం.. విమానాశ్రయానికి...

మొబైల్ వినియోగదారులకు మరో షాక్..

మన భారత్ మొబైల్ వినియోగదారులకు మరోసారి రీఛార్జ్ ధరల షాక్.. 3-6 నెలల్లో టారిఫ్ పెంపు అవకాశం దేశంలోని మొబైల్ వినియోగదారులకు...