ఘోర రోడ్డు ప్రమాదం.. ఆదిలాబాద్ వాసి సజీవ దహనం

Published on

-Advertisement-

పెనుకొండ వద్ద రెండు లారీలు ఢీకొని మంటలు.. క్యాబిన్‌లో ఇరుక్కుని డ్రైవర్ కిరణ్ మృతి

మన భారత్, ఆదిలాబాద్:
శ్రీ సత్యసాయి జిల్లాలో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆదిలాబాద్ జిల్లాలో విషాదాన్ని నింపింది. పెనుకొండ మండలం పులేకమ్మ గుడి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆదిలాబాద్‌కు చెందిన లారీ డ్రైవర్ కిరణ్ సజీవదహనమై మృతి చెందడం కుటుంబ సభ్యులను, స్థానికులను కలచివేసింది.

పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం పులేకమ్మ గుడి సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న బంగాళదుంపల లారీని, గోధుమల లోడుతో వస్తున్న మరో లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు రెండు వాహనాలు భారీగా దెబ్బతిన్నాయి. ఢీకొన్న వెంటనే గోధుమల లారీ నుంచి ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగి వాహనం మొత్తం అగ్నికి ఆహుతైంది.

ఈ ప్రమాదంలో గోధుమల లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆదిలాబాద్ జిల్లా వాసి కిరణ్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు వేగంగా వ్యాపించడంతో బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. మంటల్లో చిక్కుకుని కిరణ్ అక్కడికక్కడే సజీవదహనమై మృతి చెందాడు. ఈ దృశ్యం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఘటనను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే లారీ పూర్తిగా కాలిపోయి, డ్రైవర్ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ విషాద ఘటనతో కిరణ్ కుటుంబంలో తీవ్ర శోకసంద్రం నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువ డ్రైవర్ ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

సోయాబీన్ కాయల్లోనే మొలకలు.. రైతుల్లో ఆందోళన

  కోతకు ముందే గింజలు మొలకెత్తడంతో దిగుబడి, నాణ్యతపై ప్రభావం పంటను పరిశీలించి నష్టపరిహారం అందించాలని రైతుల విజ్ఞప్తి మన భారత్, సెప్టెంబర్...

రిమ్స్‌ను సందర్శించిన బీఆర్ఎస్ మహిళా బృందం

రిమ్స్‌ను సందర్శించిన బీఆర్ఎస్ మహిళా బృందం బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న మెరుగైన వైద్యం...

రిమ్స్‌ ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది..

మరో ఇద్దరు పసికందుల మృతి.. విషాదంలో కుటుంబాలు ఆసిఫాబాద్‌ లింగాపూర్‌, ఇంద్రవెల్లి దుబ్బగూడకు చెందిన శిశువులూ మృతి మన భారత్‌, సెప్టెంబర్‌...

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

మాజీ సర్పంచ్ రవి నాయక్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన బోథ్ ఎమ్మెల్యే మన భారత్,...

More like this