గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్ టౌన్:
రైతులు దళారుల చేతిలో మోసపోకుండా గ్రామస్థాయిలోనే జొన్నల కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. రైతులు తమ పంటను నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

జిల్లాలో రైతులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా వివిధ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ADB సొసైటీ పరిధిలో భీంపూర్ డి.ఆర్. డిపో, తలమడుగు డి.ఆర్. డిపో ఝరి, బోరజ్ రైతు వేదిక పిప్పల్వాడలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అలాగే ఇచ్చోడ సొసైటీ పరిధిలో గుడిహత్నూర్ జెడ్పీ హైస్కూల్, బజార్ఆత్నూర్ దహేగావ్ రైతు వేదిక వద్ద కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని చెప్పారు. ఉట్నూర్ సొసైటీ పరిధిలో గాదిగూడ, తడిహత్నూర్ ప్రాంతాల్లో కూడా రైతులకు సౌకర్యంగా జొన్నల కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.

రైతులు తమ పంటను మధ్యవర్తులకు అమ్మకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రైతులకు పూర్తిగా అందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల సేవలను వినియోగించుకుని లాభపడాలని ఆయన కోరారు.

జిల్లాలో పంట కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. గ్రామస్థాయిలోనే కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

విజయ్-రష్మిక క్యూట్ మూమెంట్స్ వైరల్..

అభిమానులను ఆకట్టుకుంటున్న దృశ్యాలు  మన భారత్, సినిమా డెస్క్:  సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా నిలిచే జంటల్లో విజయ్ దేవరకొండ,...

ఘనంగా ప్రపంచ రక్తదాన దినోత్సవం..

గడసాంలో ఉచిత వైద్య, రక్తదాన శిబిరం  232 మందికి వైద్య పరీక్షలు.. ప్రజారోగ్యానికి అండగా నిమ్స్ హాస్పిటల్ వైద్య బృందం మన...

టుడే లాస్ట్ డేట్.. 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు

11,127 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేడు ముగింపు  అభ్యర్థులకు కీలక సూచన.. ఈ రాత్రి 11:59...

వర్షాలు కురవాలని భీమన్నకు పూజలు..

వర్షాలు సమృద్ధిగా కురవాలని భీమన్న దేవునికి ప్రత్యేక పూజలు తాంసి మండల కేంద్రంలో భక్తిశ్రద్ధలతో ముదిరాజ్ కులస్థుల మొక్కులు మన భారత్,...

More like this

విజయ్-రష్మిక క్యూట్ మూమెంట్స్ వైరల్..

అభిమానులను ఆకట్టుకుంటున్న దృశ్యాలు  మన భారత్, సినిమా డెస్క్:  సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా నిలిచే జంటల్లో విజయ్ దేవరకొండ,...

ఘనంగా ప్రపంచ రక్తదాన దినోత్సవం..

గడసాంలో ఉచిత వైద్య, రక్తదాన శిబిరం  232 మందికి వైద్య పరీక్షలు.. ప్రజారోగ్యానికి అండగా నిమ్స్ హాస్పిటల్ వైద్య బృందం మన...

టుడే లాస్ట్ డేట్.. 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు

11,127 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేడు ముగింపు  అభ్యర్థులకు కీలక సూచన.. ఈ రాత్రి 11:59...