సైబర్ మోసం నలుగురు అరెస్ట్..

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్ టౌన్:

ఆదిలాబాద్ పట్టణంలో పాత మొబైల్ ఫోన్ల వ్యాపారం పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో మహమ్మద్, అర్షాద్, మహబూబ్ అలీ, దిన్ మహమ్మద్ ఉన్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, నిందితులు పాత మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాల పేరుతో కస్టమర్లతో పరిచయం పెంచుకొని వారి వ్యక్తిగత వివరాలు, మొబైల్ IMEI నంబర్లు సేకరించేవారు. అనంతరం బ్యాంక్ అధికారులుగా నటిస్తూ బాధితులకు కాల్స్ చేసి OTPలను పొందుతూ వారి ఖాతాల నుంచి డబ్బులు దోచుకునేవారని సీఐ వెల్లడించారు.

ఈ గ్యాంగ్‌పై ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులు వారిని పట్టుకుని విచారణ జరిపిన అనంతరం అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద పనిచేయని మొబైల్ ఫోన్లు, వివిధ మొబైల్ భాగాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు అపరిచితులపై విశ్వాసం ఉంచకుండా, వ్యక్తిగత సమాచారం మరియు OTPలను ఎవరితోనూ పంచుకోరాదని పోలీసులు హెచ్చరించారు.

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్ వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా బానోత్ వసంత్‌ రావు..

నేరడిగొండ మండల బాధ్యుడిగా బానోత్ వసంత్‌రావు.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా రాథోడ్ బాపూరావు...

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

విడుదలైన నీట్ ఫలితాలు..

విడుదలైన నీట్ ఫలితాలు -ప్రభంజనం సృష్టించిన మోషన్ కాలేజీ విద్యార్థులు విద్యార్థులను అభినందించిన మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మన...

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

More like this