సైబర్ క్రైమ్‌పై అవగాహన సదస్సు..

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు:

తలమడుగు మండలంలోని సాయిలింగి కేజీబీవీ (KGBV) పాఠశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు డిజిటల్ ప్రపంచంలో ఎదురయ్యే ప్రమాదాలను గుర్తించి, జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమంలో వివరించారు.

ఈ సందర్భంగా తలమడుగు ఎంఆర్ఓ రాజమోహన్ మాట్లాడుతూ, విద్యార్థులు సామాజిక మాధ్యమాల వినియోగాన్ని పరిమితం చేసి, చదువుపై దృష్టి సారించాలని సూచించారు. అనవసరమైన యాప్స్‌ను ఉపయోగించడం వల్ల సైబర్ మోసాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు. వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్‌లు వంటి వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదని విద్యార్థులకు సూచించారు.

సైబర్ భద్రతకు సంబంధించిన ప్రాథమిక నియమాలు, ఆన్‌లైన్ మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలో, అనుమానాస్పద లింకులు, కాల్స్, మెసేజ్‌లను ఎలా గుర్తించాలో విద్యార్థులకు వివరించారు. డిజిటల్ యుగంలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రమే సురక్షితంగా ఉండగలమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏసీడీపీవో నరసమ్మ, సూపర్వైజర్ విజయతో పాటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా బానోత్ వసంత్‌ రావు..

నేరడిగొండ మండల బాధ్యుడిగా బానోత్ వసంత్‌రావు.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా రాథోడ్ బాపూరావు...

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

విడుదలైన నీట్ ఫలితాలు..

విడుదలైన నీట్ ఫలితాలు -ప్రభంజనం సృష్టించిన మోషన్ కాలేజీ విద్యార్థులు విద్యార్థులను అభినందించిన మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మన...

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

More like this