సైబర్ క్రైమ్‌పై అవగాహన సదస్సు..
మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని సాయిలింగి కేజీబీవీ (KGBV) పాఠశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు డిజిటల్ ప్రపంచంలో ఎదురయ్యే ప్రమాదాలను గుర్తించి, జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమంలో వివరించారు. ఈ సందర్భంగా తలమడుగు ఎంఆర్ఓ రాజమోహన్ మాట్లాడుతూ, విద్యార్థులు సామాజిక మాధ్యమాల వినియోగాన్ని పరిమితం చేసి, చదువుపై దృష్టి సారించాలని సూచించారు. అనవసరమైన యాప్స్‌ను ఉపయోగించడం వల్ల సైబర్ మోసాలకు గురయ్యే అవకాశాలు...