గ్రామ ప్రజలకు రుణపడి ఉంటా..

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు (ఆదిలాబాద్):

రూయ్యాడి గ్రామ ప్రజలు తనను వార్డ్ మెంబర్‌గా గెలిపించడం పట్ల జీవితాంతం రుణపడి ఉంటానని వార్డ్ సభ్యుడు జువాక ఉత్తం తెలిపారు. ఇటీవల “మన భారత్”కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తన భావాలను వెల్లడించారు.

గత సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ ప్రజలు చూపిన విశ్వాసం తనకు ఎంతో ప్రేరణనిచ్చిందని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశయాలను నెరవేర్చడం తన ముఖ్య బాధ్యతగా భావిస్తున్నానన్నారు.

ఇకముందు రూయ్యాడి గ్రామంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్లు, కాల్వలు వంటి అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు.

ప్రజలు ప్రభుత్వ పథకాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అర్హత ఉన్నవారు తప్పక లబ్ధి పొందాలని సూచించారు. గ్రామాభివృద్ధి కోసం ప్రజల సహకారం అవసరమని, ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లగలమన్నారు.

ప్రజా పాలనను ప్రజల వద్దకు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, ఏ ఒక్కరు కూడా నిరాశ చెందకుండా అందరికీ పథకాలు అందేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు.

గ్రామాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తానని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం తన కర్తవ్యమని జువాక ఉత్తం తెలిపారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

More like this