బిర్యానీ పుచ్చకాయ తిన్న తర్వాత నలుగురి మృతి

Published on

-Advertisement-

మన భారత్, న్యూఢిల్లీ: 

మహారాష్ట్ర రాజధాని ముంబైలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాత్రిపూట బిర్యానీ, పుచ్చకాయ తిన్న అనంతరం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటన ఫుడ్ సేఫ్టీపై మరోసారి ఆందోళనలు వ్యక్తం చేయిస్తోంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం, కుటుంబ సభ్యులు రాత్రి భోజనంగా బిర్యానీతో పాటు పుచ్చకాయను తీసుకున్నారని తెలుస్తోంది. అనంతరం వారికి అస్వస్థత కలగడంతో ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదిలా ఉండగా, న్యూట్రిషనిస్టులు ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదంపై కీలక హెచ్చరికలు చేస్తున్నారు. ముఖ్యంగా పుచ్చకాయ వంటి పండ్లను కోసిన తర్వాత ఎక్కువసేపు నిల్వ ఉంచితే అవి త్వరగా కలుషితం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. పుచ్చకాయలో నీటి శాతం, చక్కెర అధికంగా ఉండటంతో బ్యాక్టీరియా వేగంగా పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అలాగే తీపి రుచి పెంచేందుకు కొందరు పండ్లలో సూదులు వేయడం వంటి అనారోగ్యకర పద్ధతులు ఉపయోగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాంటి పండ్లు ఇన్ఫెక్ట్ అయితే తీవ్ర ఆరోగ్య సమస్యలు, ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ప్రజలు బయట ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, నిల్వ ఉంచిన లేదా అనుమానాస్పదంగా కనిపించే ఆహారాన్ని తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వేసవికాలంలో ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం ఎక్కువగా ఉండటంతో పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని అంటున్నారు.

ఈ ఘటన నేపథ్యంలో ఆహార భద్రతపై అధికారులు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం..

జాతీయ రహదారిపై వేగ నియంత్రణ స్టాపర్లు, రేడియం హెచ్చరిక బోర్డుల ఏర్పాటు ట్రాఫిక్ నియమాల పాటనతోనే ప్రమాద రహిత సమాజం...

నేడు చేప ప్రసాదం పంపిణీ..

ఆస్తమా బాధితుల కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు,...

బహుజన త్యాగాలు..అగ్రకులాల భోగాలా.?

బహుజన త్యాగాల తెలంగాణలో అగ్రకులాల ఆధిపత్యం పెరిగింది: బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ బీసీ,...

వికలాంగులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: ఎన్‌పీఆర్‌డీ

టెట్ పరీక్షలకు హాజరయ్యే వికలాంగులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: ఎన్‌పీఆర్‌డీ వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం-2016 అమలు చేయాలని జిల్లా...

More like this

రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం..

జాతీయ రహదారిపై వేగ నియంత్రణ స్టాపర్లు, రేడియం హెచ్చరిక బోర్డుల ఏర్పాటు ట్రాఫిక్ నియమాల పాటనతోనే ప్రమాద రహిత సమాజం...

నేడు చేప ప్రసాదం పంపిణీ..

ఆస్తమా బాధితుల కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు,...

బహుజన త్యాగాలు..అగ్రకులాల భోగాలా.?

బహుజన త్యాగాల తెలంగాణలో అగ్రకులాల ఆధిపత్యం పెరిగింది: బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ బీసీ,...