బిర్యానీ పుచ్చకాయ తిన్న తర్వాత నలుగురి మృతి
మన భారత్, న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజధాని ముంబైలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాత్రిపూట బిర్యానీ, పుచ్చకాయ తిన్న అనంతరం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటన ఫుడ్ సేఫ్టీపై మరోసారి ఆందోళనలు వ్యక్తం చేయిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, కుటుంబ సభ్యులు రాత్రి భోజనంగా బిర్యానీతో పాటు పుచ్చకాయను తీసుకున్నారని తెలుస్తోంది. అనంతరం వారికి అస్వస్థత కలగడంతో ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ నలుగురు...