పంచాయతీ తీర్మానం.. బెల్ట్ షాపులు నిషేధం

Published on

-Advertisement-

మన భారత్, ఇచ్చోడ:
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బోరెగావ్ గ్రామపంచాయతీలో అక్రమ మద్యం విక్రయాలపై కట్టడి కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో నడుస్తున్న బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధిస్తూ సర్పంచ్ ఆసిఫ్ ఖాన్ ఆధ్వర్యంలో గ్రామ పాలకవర్గం తీర్మానం చేసింది.

ఈ నిర్ణయం ద్వారా గ్రామంలో శాంతి భద్రతలు కాపాడటంతో పాటు, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సర్పంచ్ తెలిపారు. అక్రమంగా మద్యం విక్రయాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.

గ్రామ యువతను మద్యం దుర్వినియోగం నుండి దూరంగా ఉంచేందుకు, కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు. బెల్ట్ షాపుల నిర్మూలనలో గ్రామస్థులు సహకరించాలని సర్పంచ్ ఆసిఫ్ ఖాన్ కోరారు.

ఈ చర్యతో గ్రామంలో శాంతి వాతావరణం నెలకొని, అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

ఆ కౌన్సిలర్ పై కేసు నమోదు..

పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు గణపతి నిమజ్జన బందోబస్తులో ఆటంకాలు.. ముగ్గురిపై కేసులు నమోదు మద్యం సేవించి ప్రజాశాంతికి...

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంలో ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి.. 200...

ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం

నెల రోజుల్లోనే వ్యవసాయ విద్యుత్‌ సౌకర్యం.. ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం డీడీలు చెల్లించిన వెంటనే స్పందన.. ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు...

రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ..

గిన్నెరలో రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ చిన్నారి తల్లి, కుటుంబ సభ్యులకు ధైర్యం.. అండగా ఉంటామని భరోసా...

More like this