మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్రాత్మకం..

Published on

-Advertisement-

మన భారత్, న్యూఢిల్లీ: 

దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీసే మహిళా రిజర్వేషన్ బిల్లులపై కేంద్ర ప్రభుత్వం మరొక ముఖ్యమైన ముందడుగు వేయబోతోంది. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెంచే దిశగా ఈ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రధాని Narendra Modi కీలక వ్యాఖ్యలు చేశారు.

సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని మోదీ, మహిళా సాధికారతకు ఇది చరిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. దేశ మహిళల పట్ల గౌరవంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. తల్లులు, సోదరీమణులకు ఇచ్చే గౌరవమే దేశానికి ఇచ్చే గౌరవమని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళల గొప్పదనాన్ని చాటిచెప్పే శ్లోకాన్ని కూడా ఈ సందర్భంగా పంచుకున్నారు.

ఈ కీలక బిల్లులకు చట్టరూపం ఇవ్వడానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే అంశంపై చర్చలు జరగనున్నాయి. ఈ ప్రతిపాదనలో భాగంగా లోక్‌సభ సీట్ల సంఖ్యను ప్రస్తుత 543 నుంచి గరిష్ఠంగా 850 వరకు పెంచే అవకాశం ఉందని సమాచారం.

అయితే, సీట్ల తుది సంఖ్యను డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయించనుంది. పార్లమెంటు ఆమోదం లభించిన పక్షంలో ఈ మార్పులు 2029 ఎన్నికల నుంచి అమల్లోకి వచ్చే అవకాశముంది.

ఇదిలా ఉండగా, జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపుతో తమకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిల్లులపై పార్లమెంటులో తీవ్ర చర్చలు జరిగే అవకాశం ఉంది.

మహిళా సాధికారతకు ఈ నిర్ణయం మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుండగా, రాజకీయంగా కూడా ఇది కీలక ప్రభావం చూపనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

విడుదలైన నీట్ ఫలితాలు..

విడుదలైన నీట్ ఫలితాలు -ప్రభంజనం సృష్టించిన మోషన్ కాలేజీ విద్యార్థులు విద్యార్థులను అభినందించిన మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మన...

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

గ్రామ పంచాయతీలకు శుభవార్త..

ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం కీలక నిర్ణయం పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు రంగం సిద్ధం.. గ్రామాభివృద్ధి పనులకు నిధుల వినియోగం...

More like this