అంబేద్కర్ జయంతి ర్యాలీతో వేడుకలు..

Published on

-Advertisement-

మన భారత్ ,తలమడుగు: 

తలమడుగు మండలంలోని ఝరి గ్రామంలో డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. గ్రామస్తులు, యువకులు, యువత కలిసి డప్పు చప్పుళ్ల మధ్య మంగళహారాలతో భారీ ఊరేగింపు ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీ అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న గ్రామ ప్రజలు పూలదండలతో ఘన నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి, కులమత భేదాలు లేకుండా అందరికీ భోజన వసతి కల్పించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మేస్రం రూపం కాశీరాం మాట్లాడుతూ, అంబేద్కర్ జయంతిని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా జరుపుకోవడం గ్రామ ప్రజల ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆలోచనలు సమాజానికి మార్గదర్శకమని, ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘాల సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామ యువత, గ్రామ పెద్దలు, పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యం

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలన -సర్పంచ్ నైనకంటి మమత మన భారత్,మొగుళ్ళపల్లి: పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలనను కొనసాగిస్తున్నామని, పల్లెలు...

ఉద్యమకారుల జేఏసీ మండల కమిటీ ఎన్నిక

తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడిగా చదువు అన్నారెడ్డి మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల...

రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం..

విద్యార్థులపై లాఠీచార్జ్ ,రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం -మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి...

ముగ్గురిపై కేసు నమోదు..

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పర్లపల్లి గ్రామంలో ఎస్ఐ ముప్పు సురేష్ నేతృత్వంలో పోలీస్...

More like this