రేవంత్ సర్కార్ పై గవర్నర్ కు ఫిర్యాదు..

Published on

-Advertisement-

మన భారత్ | తెలంగాణ:

రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్ నోటీసులను రాజకీయ ఆయుధాల్లా ఉపయోగిస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. కోల్ స్కామ్ అంశంపై ప్రశ్నలు లేవనెత్తడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకే తనకు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేశారని ఆయన వ్యాఖ్యానించారు.

సింగరేణి కోల్ స్కామ్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్న కొన్ని గంటల్లోనే మాజీ ఎంపీ సంతోష్‌కు కూడా సిట్ నోటీసులు అందడం యాదృచ్ఛికం కాదని హరీశ్ రావు పేర్కొన్నారు. ఇది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేపట్టిన చర్యగా అభివర్ణించారు.

రాష్ట్రంలో జరుగుతున్న అంశాలపై ప్రతిపక్ష గొంతును నొక్కే ప్రయత్నంగా సిట్ నోటీసులు మారాయని విమర్శించారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ఈ తరహా చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు.

ఇదిలా ఉండగా, సింగరేణి కుంభకోణంపై పూర్తి వివరాలతో మంగళవారం గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వెల్లడించింది. ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడి పెంచే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Latest articles

పశువులకు వ్యాధి నిరోధక టీకాలు..

 గ్రామంలో పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేసిన పశువైద్య శాఖ మన భారత్, తలమడుగు: పశుసంపద రైతులకు ప్రధాన ఆర్థిక ఆధారంగా...

ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం..

క్రాంతినగర్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం  కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకుల పిలుపు మన...

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు సేవా భావంతో సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న...

వైద్య నిర్లక్ష్యంపై బాధిత కుటుంబం ఆరోపణలు

సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్...

More like this