ఫిబ్రవరి 11న మునిసిపల్ పోలింగ్‌? ఈ నెల 27న షెడ్యూల్ విడుదలకు సంకేతాలు

Published on

-Advertisement-

మన భారత్ , తెలంగాణ:

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్‌పై రాజకీయ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ నెల 27న ఎన్నికల షెడ్యూల్ విడుదలై, ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించే అవకాశముందని చర్చ జరుగుతోంది. ఈ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా 116 మునిసిపాలిటీలు, 7 మునిసిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి. స్థానిక సంస్థలపై పట్టు సాధించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ కసరత్తు పెంచాయి. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచార ప్రణాళికలపై పార్టీల్లో అంతర్గత చర్చలు కొనసాగుతున్నాయి.

ఈ ఎన్నికల్లో మొత్తం 2,996 వార్డుల పరిధిలో 52,43,023 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 26,80,014 మంది మహిళలు, 25,62,369 మంది పురుషులు, 640 మంది ఇతర ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాను ఇప్పటికే ప్రచురించడంతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది.

ఇదిలా ఉండగా, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని ఎన్నికల ఏర్పాట్లు, సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లతో వరుసగా వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేలా అధికార యంత్రాంగానికి మార్గనిర్దేశం చేస్తున్నట్లు సమాచారం.

అధికారిక షెడ్యూల్ విడుదలపై ఇంకా స్పష్టత రాకపోయినా, మునిసిపల్ ఎన్నికలపై జరుగుతున్న చర్చలు తెలంగాణ రాజకీయాలను మరింత ఉత్కంఠకు గురిచేస్తున్నాయి.

Latest articles

గ్రామ దేవతలకు జలాభిషేకాలు..

తలమడుగు | జూలై 19 మన భారత్ ప్రతినిధి| వానల కోసం గ్రామ దేవతలకు జలాభిషేకాలు.. తలమడుగులో మహిళల ప్రత్యేక...

రేపు ప్రజావాణి రద్దు.!

మన భారత్, ఆదిలాబాద్ మంత్రి పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్‌లో సోమవారం ప్రజావాణి రద్దు ఆదిలాబాద్, జూలై 19: ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో...

నకిలీ ఫోన్‌పేతో రూ.7,610 మోసం.. ఇద్దరు నిందితులు అరెస్ట్

నకిలీ ఫోన్‌పేతో రూ.7,610 మోసం.. ఇద్దరు నిందితులు అరెస్ట్ మూడు నూనె డబ్బాలు కొనుగోలు చేసి నకిలీ చెల్లింపు.. దొంగ...

20 న మంత్రి జూపల్లి రాక..

ఎల్నినో ప్రభావంపై అప్రమత్తం.. జూలై 20న ఉట్నూరులో మంత్రి జూపల్లి పర్యటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, ప్రత్యామ్నాయ...

More like this