e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

ఆత్మవిశ్వాసమే ఆయుధంగా… వైకల్యాన్ని జయించిన గురూజీ గుల్షన్ లోహార్

ఆత్మవిశ్వాసమే ఆయుధంగా… వైకల్యాన్ని జయించిన గురూజీ గుల్షన్ లోహర్

మన భారత్, న్యూఢిల్లీ

వైకల్యం శరీరానికే తప్ప ఆశయానికి కాదని మరోసారి నిరూపిస్తున్నారు ఝార్ఖండ్‌కు చెందిన గుల్షన్ లోహర్. పుట్టుకతోనే రెండు చేతులు లేకపోయినా, అసాధారణమైన ఆత్మవిశ్వాసం, పట్టుదలతో చదువును కొనసాగించి ఎం.ఎడ్ (MEd) పూర్తి చేసి ఉపాధ్యాయుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ప్రస్తుతం ఆయన బరంగా హైస్కూల్లో గణితం బోధిస్తూ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.

క్లిష్టమైన గణిత సమస్యలను అలవోకగా రాస్తూ, సులభంగా అర్థమయ్యే రీతిలో వివరిస్తూ విద్యార్థుల ప్రశంసలు అందుకుంటున్నారు. శారీరక పరిమితులు ఆయన ప్రతిభకు, బోధనా నైపుణ్యానికి అడ్డుకాలేకపోయాయి. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ, “నిరంతర ప్రయత్నమే విజయానికి మార్గం” అన్న సందేశాన్ని తన జీవితం ద్వారా నేర్పిస్తున్నారు.

తమ పిల్లల భవిష్యత్తు కోసం తక్కువ జీతానికే పనిచేస్తూ, విద్యే ఆయుధంగా గ్రామాన్ని ముందుకు నడిపిస్తున్న గుల్షన్ లోహర్‌ను గ్రామస్థులు అపారమైన గౌరవంతో ప్రేమగా ‘గురూజీ’ అని పిలుచుకుంటారు. ఆయన జీవితం లక్ష్యసాధనకు ప్రేరణగా నిలుస్తూ, వైకల్యం ఒక అడ్డంకి కాదని, ధైర్యం ఉంటే ఏదైనా సాధ్యమేనని చాటిచెప్పుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE