ఆత్మవిశ్వాసమే ఆయుధంగా… వైకల్యాన్ని జయించిన గురూజీ గుల్షన్ లోహార్
ఆత్మవిశ్వాసమే ఆయుధంగా… వైకల్యాన్ని జయించిన గురూజీ గుల్షన్ లోహర్ మన భారత్, న్యూఢిల్లీ వైకల్యం శరీరానికే తప్ప ఆశయానికి కాదని మరోసారి నిరూపిస్తున్నారు ఝార్ఖండ్‌కు చెందిన గుల్షన్ లోహర్. పుట్టుకతోనే రెండు చేతులు లేకపోయినా, అసాధారణమైన ఆత్మవిశ్వాసం, పట్టుదలతో చదువును కొనసాగించి ఎం.ఎడ్ (MEd) పూర్తి చేసి ఉపాధ్యాయుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ప్రస్తుతం ఆయన బరంగా హైస్కూల్లో గణితం బోధిస్తూ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. క్లిష్టమైన గణిత సమస్యలను అలవోకగా రాస్తూ, సులభంగా...