e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

బాధిత కుటుంబాలను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు

బాధిత  కుటుంబాలను పరమర్శించిన బీఆర్ఎస్ నాయకులు

మన భారత్, తాంసి: తాంసి మండలంలోని పాలోడి గ్రామంలో ఇటీవల జరిగిన ప్రమాదాల్లో గాయపడిన కుటుంబాలను బీఆర్ఎస్ నాయకులు పరమర్శించారు. ట్రాక్టర్ నుంచి పడి గాయాలపాలైన ప్రవీణ, బైక్ అదుపుతప్పి గాయపడిన రమాకాంత్‌తో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న పోసాని కుటుంబాన్ని వారి నివాసాలకు వెళ్లి పరామర్శించారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, ప్రమాదాలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. బాధిత కుటుంబాలకు మానసిక ధైర్యం చెప్పి, ఎలాంటి అవసరం వచ్చినా పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కష్ట సమయంలో పార్టీ నాయకులు ముందుకొచ్చి పలకరించడం అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో జామిడి గ్రామ సర్పంచ్ ఈరగొల్ల అశోక్, మాజీ ఎంఫీటీసీ మలపతి అశోక్, బీఆర్ఎస్ నాయకులు వినోద్ రెడ్డి, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల కష్టసుఖాల్లో పార్టీ ఎప్పుడూ తోడుగా ఉంటుందని నాయకులు ఈ సందర్భంగా తెలిపారు.

BRS Leaders, Tamsi News, Palodi Village, Accident Victims, Telangana Politics, Man Bharat News, BRS Party Activities, Public Welfare

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE