భార్యపై దాడి…పరిస్థితి విషమం

Published on

-Advertisement-

భార్యపై దాడి…పరిస్థితి విషమం

మన భారత్, తాంసి, నవంబర్ 23 : ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పర్ల గ్రామంలో మద్యం మత్తులో జరిగిన ఘోర సంఘటన కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం ఆదివారం కప్పర్ల గ్రామానికి చెందిన మల్లెల నరేష్, మద్యం మత్తులో తన భార్య లావణ్యతో ఘర్షణకు దిగాడు.ఇటివల భార్య పిర్యాదుతో డవు సెంటర్ కు తరలించగా మళ్ళీ తిరిగి నెల రోజుల తరువాత ఇంటికి వచ్చాడు.దింతో భార్య పై కోపంతో ఇనుప పట్టితో భార్య తలపై అతికిరాతకంగా దాడి చేసినట్లు తెలిపారు. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న లావణ్యను గమనించిన కుటుంబీకులు వెంటనే ఆదిలాబాద్‌ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు గుర్తించి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాదు కు రెఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై లావణ్య తరుపున బంధువు పోలీసులకు ఫిర్యాదు చేయగా, తాంసి ఎస్సై జీవన్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో ఈ ఘటన తీవ్రమైన ఆందోళనకు దారితీసింది.

Latest articles

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ..

దేవాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహించిన బీఆర్‌ఎస్ నాయకులు మన భారత్,...

అడవిపందుల బీభత్సం.. సోయా పంట ధ్వంసం

ఎకరం సోయా పంట నాశనం.. ఆందోళనలో రైతు మన భారత్, సెప్టెంబర్ 25, తలమడుగు: అడవిపందుల బెడదతో సోయాబీన్ రైతు...

బాబూజీ హాస్పిటల్‌లో ‘వాట్సాప్’ వైద్యం!

బాబూజీ హాస్పిటల్‌లో 'వాట్సాప్' వైద్యం! ఆరోగ్యశ్రీ బోర్డులు మాత్రమే ఉన్నాయి.. ఐసీయూ (ICU) లేదు, డాక్టర్లు రారు!రాత్రి వేళల్లో పేషెంట్ల ప్రాణాలు...

రోస్టర్ విధానం పాటించాలని వినతి..

ప్రీ ప్రైమరీ పోస్టుల నియామకాల్లో పారదర్శకత పాటించాలి సరైన రోస్టర్‌ విధానాన్ని పాటించి అర్హులైన వారికి అవకాశం కల్పించాలి: బీఆర్‌ఎస్‌...

More like this