e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

ఎన్నికల సంఘానికి మమతా బెనర్జీ లేఖ..

ఓటర్ల జాబితా సవరణ నిలిపివేయండి: ఎన్నికల సంఘానికి మమతా బెనర్జీ లేఖ

బెదిరింపుల ఆరోపణలతో బ్లోలపై సిఎం విమర్శలు

మన భారత్ , బెంగాల్: పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (Special Summary Revision – SIR)ను తక్షణమే నిలిపివేయాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల సంఘానికి అత్యవసరంగా లేఖ రాశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్కు పంపిన ఈ లేఖలో మమతా బెనర్జీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

సిఎం వ్యాఖ్యానించిన ముఖ్యాంశాలు:

BLOలు పరిధి దాటి వ్యవహరిస్తున్నారు

ఎన్నికల సంఘం తీరు ఆమోదయోగ్యం కాదు

“సహకరించక, భయపెడుతున్న తీరు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం”

ప్రక్రియను వెంటనే ఆపి, అధికారులకు సరైన శిక్షణ ఇవ్వాలి

“ప్లానింగ్ లేకుండా జరుగుతున్న ఈ ప్రక్రియ ఎన్నికల నిర్వహణలో సమస్యలను తెస్తుంది” అని హెచ్చరించారు.

మమతా బెనర్జీ లేఖలో పేర్కొన్న అంశాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై రాష్ట్ర–కేంద్ర ఎన్నికల సంస్థల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE