మటన్ బోన్ గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి

Published on

-Advertisement-

🍖 దావత్లో విషాదం… మటన్ బోన్ గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి. నూతన ఇల్లు వేడుక దుఃఖంలో ముగిసింది

మన భారత్‌, నాగర్‌కర్నూల్‌,:  నూతన గృహ నిర్మాణ వేడుక ఆనందాన్ని కాసేపట్లోనే దుఃఖంలో ముంచెత్తిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బొందలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బుధవారం రాత్రి గ్రామానికి చెందిన ఓ కుటుంబం మేస్త్రీల కోసం ఏర్పాటు చేసిన దావత్లో ఈ విషాదం సంభవించింది.

స్థానికుల సమాచారం ప్రకారం, మేస్త్రీలలో ఒకరైన పోలేముని లక్ష్మయ్య (45) భోజనం చేస్తూ మటన్ ముక్కలోని ఎముక గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక కుప్పకూలిపోయాడు. వెంటనే సహచరులు అతడిని సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ, మార్గమధ్యంలోనే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest articles

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

More like this