ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు

Published on

-Advertisement-

ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యటన అంతర్‌రాష్ట్ర రహదారి పరిశీలనలో ప్రమాద స్థలాల గుర్తింపు

మన భారత్, తాంసి, నవంబర్ 11: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. మంగళవారం ఆయన ఆదిలాబాద్ రూరల్, తాంసి, తలమడుగు మండలాల మీదుగా వెళ్లే అంతర్ రాష్ట్ర రహదారిపై పర్యటించారు.

ఈ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని రాంపూర్,తాంసి మండలంలోని పొన్నారి, హస్నాపూర్, అలాగే లక్ష్మీపూర్ (తలమడుగు మండలం) గ్రామాల పరిధిలో గతంలో చోటుచేసుకున్న ప్రమాద స్థలాలను స్వయంగా పరిశీలించారు. ప్రతి ప్రమాద స్పాట్‌లో రోడ్డు నిర్మాణ లోపాలు, మలుపులు, దృశ్యమానత సమస్యలను గుర్తించారు.

ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రమాదాలు తగ్గించేందుకు త్వరలోనే స్పీడ్ బ్రేకర్లు, రంబుల్ స్ట్రిప్స్, రిఫ్లెక్టివ్ రేడియం బోర్డులు, ప్రమాద హెచ్చరిక సైన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నాం,” అని తెలిపారు.

అలాగే వాహనదారులు వేగాన్ని నియంత్రించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని సూచించారు.

పర్యటన అనంతరం పొన్నారి గ్రామ ప్రజలు ఎస్పీని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫనిధర్, తాంసి ఎస్సై జీవన్ రెడ్డి, రూరల్ ఎస్సై విష్ణువర్ధన్, తహసీల్దార్ లక్ష్మీ, మాజీ వైస్ ఎంపీపీ రఘు, మాజీ సర్పంచ్ అండె అశోక్, కేమ లక్ష్మణ్ ,రమణ, పోలీసులు, అధికారులు పాల్గొన్నారు.

Latest articles

Google ప్రపంచాన్ని మార్చిన టెక్ దిగ్గజం..

మన భారత్, ఇంటర్నేషనల్ : ప్రపంచ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీసిన సంస్థగా Google ప్రత్యేక గుర్తింపు పొందింది....

ఆపరేషన్ చేస్తుండగా వైద్యుడికి గుండెపోటు..

మన భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. సురేందర్ గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా...

ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు..

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఎదురుచూస్తున్న సమ్మర్ హాలిడేస్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. రాష్ట్ర పాఠశాల...

రూ.7 లక్షలతో కల్వర్టు నిర్మాణానికి పూజ..

మన భారత్, తాంసి: గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో సీసీ కల్వర్టు నిర్మాణానికి...

More like this