బీటీ రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తా : ఎమ్మెల్యే అనిల్ జాదవ్

Published on

-Advertisement-

వడ్డాడి ప్రాజెక్టును పరిశీలించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్..

గేట్ల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచనలు

మన భారత్, ఆదిలాబాద్:

తాంసి మండలంలోని వడ్డాడి ప్రాజెక్టును శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి ప్రాజెక్టు గేట్లు, నిర్మాణ పరిస్థితులను పరిశీలించారు. ప్రాజెక్టుకు అవసరమైన మరమ్మతు పనులను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

వడ్డాడి ప్రాజెక్టు రైతులకు, స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరమైనదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. నీటి వనరుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

అలాగే ప్రాజెక్టు నుంచి వడ్డాడి గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రహదారి సౌకర్యాలు కీలకమని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ విఠ్ఠల్, అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

గొంటి ముక్కుల ప్రసాద్, జర్నలిస్ట్ , మన భారత్ .

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

కేసీఆర్ కుటుంబంపై మెరుగు సురేష్ గౌడ్ ఫైర్ 

మొగుళ్ళపల్లి సెప్టెంబర్ 21, (మన భారత్): తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్రోలుకు, డీజిల్ కు కూడా పైసలు లేవన్న వాళ్లు,...

ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

51 శాతం ఫిట్‌మెంట్‌తో వెంటనే పీఆర్సీ ప్రకటించాలి.. పెండింగ్‌ డీఏలు విడుదల చేయాలి: తపస్‌ జిల్లా అధ్యక్షుడు సునీల్‌...

విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధికి బోధనోపకరణాలు దోహదం

తలమడుగులో మండల స్థాయి బోధనోపకరణాల మేళా తహసీల్దార్ బి. రాజమోహన్ మన భారత్, తలమడుగు, సెప్టెంబర్ 21: విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా...

త్రిషల్ గణేష్ మండలిలో ప్రత్యేక పూజలు..

మన భారత్, సెప్టెంబర్21, మావల: మావలలోని త్రిషల్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శ్రీ వినాయకుడిని ఆదిలాబాద్ మార్కెట్...

More like this