సంగారెడ్డిలో రెచ్చిపోతున్న మొరం మాఫియా

Published on

-Advertisement-

ప్రభుత్వ భూమిలో నుంచి అక్రమంగా మొరం తరలింపు

మన భారత్, సంగారెడ్డి:
సంగారెడ్డి జిల్లాలో మొరం మాఫియా మరోసారి రెచ్చిపోతోంది. అందోల్ మండలం సంగుపేట శివారులోని ప్రభుత్వ భూమి నుంచి అక్రమంగా మొరం తవ్వి ప్రైవేట్ వెంచర్‌కు తరలిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఆదివారం సెలవు రోజు కావడంతో అధికారులు అందుబాటులో ఉండరని అంచనా వేసి, కొందరు అక్రమార్కులు నిర్భయంగా మొరం తరలింపు కార్యక్రమాన్ని కొనసాగించారు. స్థానికుల సమాచారం మేరకు, మొరం తరలింపు జరుగుతోందని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందినప్పటికీ, వారంతా “ఆదివారం” అని కారణం చూపుతూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. ఈ పరిస్థితిని వినియోగించుకున్న మాఫియా సభ్యులు నిర్భయంగా ప్రభుత్వ భూమిని తవ్వి ప్రైవేట్ వెంచర్‌కు మొరం పంపించారు. సహజ సంపదలను రక్షించాల్సిన బాధ్యత ఉన్న అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. స్థానికులు మాట్లాడుతూ, “రెవెన్యూ అధికారులు చూసినట్లు చూడకపోవడం వల్లే మాఫియా బలపడుతోంది. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనాలకు వాడుకోవడం తీవ్రంగా ఖండనీయమైందని” అన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి దర్యాప్తు చేయాలని, మొరం అక్రమంగా తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Latest articles

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

More like this