సంగారెడ్డిలో రెచ్చిపోతున్న మొరం మాఫియా
ప్రభుత్వ భూమిలో నుంచి అక్రమంగా మొరం తరలింపు మన భారత్, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో మొరం మాఫియా మరోసారి రెచ్చిపోతోంది. అందోల్ మండలం సంగుపేట శివారులోని ప్రభుత్వ భూమి నుంచి అక్రమంగా మొరం తవ్వి ప్రైవేట్ వెంచర్‌కు తరలిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఆదివారం సెలవు రోజు కావడంతో అధికారులు అందుబాటులో ఉండరని అంచనా వేసి, కొందరు అక్రమార్కులు నిర్భయంగా మొరం తరలింపు కార్యక్రమాన్ని కొనసాగించారు. స్థానికుల సమాచారం మేరకు, మొరం తరలింపు జరుగుతోందని రెవెన్యూ అధికారులకు...